టీఆర్ఎస్ నేతలపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ పదవి కోసమే ఈటల పై కడియం విమర్శలు చేస్తున్నారన్నారు. రేపో మాపో కడియం శ్రీహరి కూడా బిజెపిలోకి రావాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పక్కన ఉన్నవాళ్లకు టిఆర్ఎస్ లో పదవులు రావడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీ, అమిత్ షా వద్ద ఎన్ని డిగ్రీలు వంగారో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. పదవులకోసం కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ప్రదిక్షణలు చేసినప్పుడు కడియంకు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అని ప్రశ్ని