జూన్ 1 నుండి రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరవాలని సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేసీఆర్ నిర్ణయాన్ని ఉపాద్యాయ సంఘాలు వ్యతిరేఖిస్తున్నాయి. స్కూళ్ళు తెరవడానికి పూర్తి సన్నద్ధత కాకముందే సీఎం నిర్ణయం తీసుకోవడం విచారకరమని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని ఉపాధ్యాయుల సంఘం యూటీఎఫ్ ఆరోపిస్తోంది. జూలై 1 లోగా అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో పారిశుధ్య సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని డిమాండ్ చేస్తోంది.