కోదాడలోని తిరుమల ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీపై ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. భాదితురాలు కేకలు వేయడంతో కామాందుడు పరారీ అయ్యాడు. కోవిడ్ టెస్టులు చేయాలంటూ గదిలోకి తీసుకెళ్లి నీచంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.