ఏపీలో వ్యాక్సిన్ మేళా జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ లు వేస్తున్నారు. వ్యాక్సిన్ లు వేసుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో సొంత రికార్డును ఏపీ వైద్యారోగ్యశాఖ బ్రేక్ చేసింది. ఈ రోజు ఒక్కరోజే వ్యాక్సినేషన్ 10లక్షల మార్క్ ను దాటేసింది.