హైదరాబాద్ నగరంలో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా మారిన హైదరాబాద్ లో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యవసరం అని పేర్కొన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో కసౌళి లో ఉన్న జాతీయ వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కు ఇక్కడి సంస్థలు టెస్టింగ్ కి పంపడం ద్వారా 45 రోజుల సమయం వృధా అవుతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.