కృష్ణానది పరివాహక ప్రాంతంలో యువతిపై అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా తాజాగా ఈ ఘటన పై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ....కృష్ణా నది పరివాహక ప్రాంతంలో యువతి పై జరిగిన ఘటన అత్యంత హేయం, బాధాకరమని డీజీపీ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్ ల కు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని డీజీపీ వార్నింగ్ ఇచ్చారు.