కరోనా కారణంగా మరణించిన వారికి రూ.4లక్షల పరిహారం ఇవ్వాలేమని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం అంశంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఇదిలా ఉండగా పది రోజుల క్రితం ఈ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరింగింది. అయితే కేంద్రం తరపన న్యాయవాది తమకు పదిరోజులు సమయం కావాలని కోరారు. ఈ పిటిషన్ ను ప్రతివాదిగా తీసుకోవడం లేదని కేంద్రం సానుభూతి గా తీసుకుంటుందని తెలిపారు. కానీ ఈ రోజు కేంద్రం తీరుతో బాధిత కుటుంబాలకు ఆశలు లేకుండా పోయాయి.