నాగ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. 45 ఏళ్ల టైలర్ తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....నాగ్ పూర్ లో నివాసం ఉంటున్న అలోక్ మటూకర్ అనే వ్యక్తి తన కుంటుబంలోని భార్య, కుమారుడు 12, కుమార్తె 14 లను గొంతు కోసి కిరాతకంగా హత మార్చాడు. అనంతరం సమీపంలోని తన అత్త ఇంటికి వెళ్లి ఆమెను కూడా హత్య చేశారు. అంతే కాకుండా అక్కడే ఉన్న మరదలిని కూడా హతమార్చాడు.