టీఆర్ఎస్ పార్టీకి పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. అంతే కాకుండా నియోజక వర్గంలోని కార్యకర్తలు, నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా తనపై కామెంట్లు చేసే వారిపై ఈటల విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈటల రాజేందర్ తనపై కామెంట్లు చేసిన ఓ టీఆర్ఎస్ మంత్రిపై ఫైర్ అయ్యారు. మేం ఎవరి జోలికి వెళ్ళం..20 ఏళ్లలో ఎప్పుడూ గొడువలకు తావు ఇవ్వలేదని అన్నారు. కుల సంఘాల మీటింగులు పెట్టి, అంగట్లో మాదిరిగా అందరినీ కొంటున్నారంటూ ఆరోపించారు.