సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు కొత్త దారులను వెతుకున్నారు. కాస్త అప్రమత్తంగా ఉన్న అకౌంట్ లను కాళీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల సైబర్ నేరాలను పోలీసులు గుర్తించగా తాజాగా ఓ కొత్త రకం మోసాన్ని గుర్తించారు. సైబర్ నేరగాళ్లు ఈ కామర్స్ వెబసైట్ల పేరుతో మోసం చేయడాన్ని పోలీసులు గుర్తించారు. తక్కువ ధరలకు నిత్యావసరాలకు అందిస్తామంటూ జాప్ నౌ పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించారు. వెబ్ సైట్ లో పలు వస్తువులు 1 రూపాయికే అందిస్తామని అమాయకులకు వల వేస్తున్నారు.