కోర్టు అనుమతి లభించడంతో ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేస్తున్నారు. దాంతో అన్ని జిల్లాల ప్రజలు అనందయ్య మందు కోసం ఎగబడుతున్నారు. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు సైతం ఆనందయ్య మందును తీసుకుంటున్నారు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సామాగ్రి లేకపోవడంతో మందు తయారీ లో వెనక పడ్డామని తెలిపారు. అంతే కాకుండా ప్రతి జిల్లాలోనూ కరోనా మందును అందజేస్తామన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అడిగిన వారందరికీ కరోనా మందును అందిస్తున్నామని చెప్పారు. బడ్డీ బంకుల్లో తన మందు అమ్ముతున్నారు.