జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభిస్తున్నామని సర్కార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. దాంతో పాఠశాలల ప్రారంభంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని హైకోర్టు ప్రశ్నించగా....ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సమాదానం ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.