బీహార్ దర్భాంగ్ రైల్వే స్టేషన్ పార్సెల్ జంక్షన్ లో ఇటీవలే జరిగిన బాంబు పేలుళ్ళ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్సెల్ కౌంటర్ సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్సెల్ కౌంటర్ వద్ద ఉన్న సీసీ టీవీ పుటేజ్ ను రైల్వే పోలీసులు పరిశీలించారు. జూన్ 17 న బీహార్ దార్భాంగ్ రైల్వే స్టేషన్ పార్సెల్ జంక్షన్ వద్ద అతి తక్కువ తీవ్రత తో పేలుళ్ల ఘటన చోటు చేసుకుంది. అయితే జూన్ 15 న అనుమానిత రిజిష్టర్ పార్సెల్ ను సరిగ్గా 3:25 నిమిషాలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్సెల్ కేంద్రం నుండి అనుమానితుడు డర్భాంగ్ కు పార్సెల్ ద్వారా చేరవేసినట్టు సీసీ కెమెరాల ఆధారంగా డార్భాంగ్ రైల్వే పోలీసులు గుర్తించారు.