ఏపీలో ఈ రోజు నుండి విదేశీ మద్యం బ్రాండ్ ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ విదేశీ బ్రాండ్ లను కేవలం రాష్ట్ర పర్యాటకశాఖ ఆద్వర్యంలోని బార్లలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని పర్యాటకశాఖ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. దేశీ విదేశీ పర్యాటకులను ఆకర్శించేందుకు ఈ నిర్నయం తీసుకున్నట్టు వెల్లడించారు.