సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జులై 1 నుండి నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలకు సంబంధించిన సమీక్ష సమావేశాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల కింద చేపట్టాల్సిన పనులు, వాటిని పటిష్టంగా అమలు చేసేందుకు ఆచరించాల్సిన విధానాలను గురించి చర్చించారు.