సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రి లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఊరి ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సహపంక్తి బోజనల్లో వేలమంది పాల్గొన్నారు. అయితే తాజాగా భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ పక్కనే కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆగమ్మ మొదట అస్వస్థతకు గురైంది. దాంతో వైద్యులు చికిత్స చేయగా మంగళవారం కోలుకుంది. ఆ తర్వాత ఊర్లోనే ఒక బాలిక అస్వస్థతకు గురైంది. బాలికకు కూడా ఆస్పత్రిలో చికిత్స అందించారు.