తాజాగా పరీక్షల షెడ్యూల్ ను సైతం హైదరాబాద్ జేఎన్టీయు విడుదల చేసింది. ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై 5 నుండి 14 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా మార్చ్ నెలలో వాయిదాపడిన బీటెక్ మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్, బి ఫార్మసీ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను జూలై 13 వ తేదీన నిర్వహించనున్నారు. అంతేకాకుండా మార్చిలో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఇచ్చిన హాల్ టికెట్స్ మరియు ఎగ్జామ్ సెంటర్ లలోనే పరీక్షలు రాయవచ్చని ప్రకటించింది.