మల్లన్న సాగర్ నిర్వాసితుల పరిహారం చెల్లింపు పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా హైకోర్టు ఒంటరి మహిళలు, పురుషులకు పరిహారం అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా పరిహారం అందించకుండా ఇళ్లను కాళీ చేయవద్దంటూ ఆదేశించింది. పిటిషన్ లో పేర్కొన్న సభ్యులు కలెక్టర్ ముందు హాజరై సంబంధిత పత్రాలు చూపించి పరిహారం పొందవచ్చునని న్యాయస్థానం స్పష్టం చేసింది.