తెలంగాణలో పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు . రాష్ట్రంలో కొంత మంది పోలీసులు తీరు మార్చుకోవాలని అన్నారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోస్టింగుల కోసం టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని ఆరోపించారు. హోమంత్రి...డీజీపీ ఉన్నారా లేదా అనేది తెలియడం లేదని అన్నారు. తెలంగాణలో విచిత్ర పాలన నడుస్తుందన్నారు.