సిద్దిపేట పట్టణంలోని వీపంచి కళా నిలయంలో సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం రైతుల పాలిట వరం అని అన్నారు. ఏడేండ్ల కిందట ఎరువుల, విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద , కాలిపోయే ట్రాన్స్ ఫార్మర్ లు నిత్య కృత్యంగా ఉండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో ఒకచోట రైతు ఆత్మహత్యలు ఉండేవని చెప్పారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి కొత్త రూపు ఇచ్చి దశ దిశ మార్చామని చెప్పారు.