భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన భార్య సవితాదేవితో కలిసి తన స్వస్థలం యూపీలోని కాన్పూర్ కు రైలులో బయలుదేరారు. ఆయన భార్యతో కలిసి ఢిల్లీ సప్ధర్ జంగ్ రైల్వ్యే స్టేషన్ లో ప్రత్యేక రైలును ఎక్కారు. ఉదయం 11 30 నిమిషాలకు ఈ రైలు బయలుదేరింది. ఇక రేపు సాయంత్రం వరకు ఆయన స్వగ్రామానికి చేరుకోనుంది. ఇక రాష్ట్రపతికి కేంద్ర రైల్వ్యేశాఖ మంత్రి పీయూష్ గోయల్ రైల్వ్యే స్టేషన్ కు వచ్చి వీడ్కోలు పలికారు. ఈ సందర్భగా ఓ జ్ఞాపికను కూడా అందజేశారు.