బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి కేసీఆర్ పై విమర్శలు కురిపించారు. కేసీఆర్ గారి వాసాలమర్రి కథ "వెర్రి తగ్గింది, రోకలి నెత్తికి చుట్టుండ్రి..." అన్న తీరుగుందంటూ వ్యంగ్యాస్థ్రాలు కురిపించారు. ఎప్పట్నుండో చెబ్తున్న అంకాపూర్ ముచ్చట కేసీఆర్ మల్లా షురు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా ఇదే లెక్క.. అంకాపూర్ గురించి డెవలప్మెంట్ మాటలు విన్నామని..ఇప్పటి ప్రగతి ఆ ఊర్లలో ఏమిటో ఈ టోపీ మాటల సీఎం గారు చెప్పాలన్నారు. అదేదో సినిమాలో కోటా గారి కోడి కథ లెక్కుంది.. కేసీఆర్ గారి అంకాపూర్ కహానీ అంటూ రాములమ్మ వ్యాఖ్యానించారు.