మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సంధర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుని నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా తెలుగు తేజానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సోషల్ మీడియా వేధికగా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో...భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అయిన శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు.