హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. నేడు జాన్ మనోజ్ హెచ్ సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలను తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తాను హెచ్సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున జాన్ మనోజ్ నియామకం చెల్లదని అజహారుద్దీన్ వాదిస్తున్నారు. కానీ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు అజహారుద్దీన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ అజహారుద్దీన్ వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తుంది.