దేశంలో కరోనా కేసుల సంఖ్య మెల్లి మెల్లిగా తగ్గుముకం పడుతోంది. దాంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లో సడలింపులు చేయడం...లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయడం చేస్తున్నాయి. ఇదివరకూ కేసులు సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. ప్రస్తుతం మరణాలతో పాటు కేసులు కూడా తగ్గుముకం పట్టాయి. ఇప్పటికే తెలంగాణలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఏపీలోనూ లాక్ డౌన్ ను సడలిస్తూ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 8 జిల్లాల్లో లాక్ డౌన్ లో సడలింపులు చేస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ పాజిటివిటీ 5 శాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.