ఈ రోజు ఉదయం లడఖ్‌లోని లేహ్ ప్రాంతానికి సమీపంలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని భూకంప నిర్ధారణ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంపం కేంద్రం లడఖ్‌లోని లేహ్‌కు 86 కిలోమీటర్ల తూర్పు-ఈశాన్యంలో ఉందని ఏజెన్సీ స్పష్టం చేసింది. భూమి ఉపరితలం నుండి 18 కిలోమీటర్ల లోతులో ఉదయం 6:10 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది.