తెలంగాణ ను మావోయిస్టు రహిత రాష్ట్రం గా చేయడమే ప్రధాన లక్ష్యమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మావోయిస్టులు మళ్లీ పుంజుకోకుండా అప్రమత్తంగా వ్యహరిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. అజ్ఞాత మావోయిస్టులు కరోనా తో బాధపడుతున్నట్టు తమకు సమాచారం అందిందని అన్నారు. మావోయిస్టులు కరోనా తో అడవిలో చనిపోయే బదులు జనజీవన స్రవంతి లోకి రావాలని డీజీపీ కోరారు. మావోయిస్టులు లొంగిపోతే అవసరమైన వైద్యం అందిస్తామని అన్నారు.