దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇది వరకు దేశంలో లక్షల సంఖ్యలో కేసులు వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య వేలకు చేరుకుంది. అంతేకాకుండా మరణాల సంఖ్య వందలకు చేరుకుంది. రికవరీ రేటు కూడా దేశంలో బాగానే పెరిగింది. ఇక తాజాగా ఈరోజు దేశంలో 37,566 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక 102 రోజుల తరవాత మళ్లీ 40వేలకు తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి కావడం సంతోషించాల్సిన విషయం.