ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గొల్లపూడిలో పర్యటించనున్నారు. మహిళల భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ యాప్’ వినియోగంపై అవగాహన, చైతన్యం కల్పించనున్నారు. దీనికి సబంధించి ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రామానికి సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు.