ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు దిశ యాప్ పై విజయవాడ గొల్లపూడి లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ....ప్రతి మహిళ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఆపద సమయాల్లో దిశ యాప్ లో ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కితే పోలీసులకు క్షణాల్లో సమాచారం అందుతుందన్నారు. యాప్ తెరిచి ఫోన్ షేక్ చేసినా కూడా పోలీసులకు అలర్ట్ వెళుతోందని అన్నారు. యాప్ లో బటన్ నొక్కగానే ఆడియో,వీడియో కూడా రికార్డ్ అవుతుందని చెప్పారు.