టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం 'అక్టోబర్ 31 లేడీస్ నైట్" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. విద్యా లేక, రకుల్ ప్రీత్ సింగ్ ల పై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా లో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, మౌనిక జాన్, మేఘ ఆకాష్ లు నటిస్తున్నారు.