టి20 వరల్డ్ కప్ వేదిక ఫిక్స్ అయింది. ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్ టోర్నీని యూఏఈ లో జరగబోతుంది. అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీని నిర్వహించబోతున్నట్టు తాజాగా ఐసీసీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొన్నబోతున్నాయి. ఇక ఈ టోర్నీ మ్యాచ్ లన్నీ అబుదాబి, దుబాయ్, షార్జా వేదికగా జరుగుతాయి.