కరోనా విజృంభణతో విద్యాసంస్థలన్నీ మూత పడిన సంగతి తెలిసిందే. దాంతో విద్యార్థులందరికీ ఆన్లైన్ క్లాస్ లను నిర్వహిస్తున్నారు. అయితే చాలా మంది ఆన్లైన్ క్లాస్ లు వినేందుకు సిగ్నల్ సమస్యతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా గోవాలో పలువురు విద్యార్థులు సిగ్నల్ రాకపోవడంతో ఏకంగా నిరసనకు దిగారు. గోవాలోని కోడల్, సట్రెమ్, డీరోడ్ గ్రామాల విద్యార్థులకు సిగ్నల్ అందడం లేదు. దాంతో ఆన్లైన్ క్లాస్ లు విననలేక పోతున్నారు.