ప్రముఖ నటి మందిరా బేడి భర్త, నిర్మాత రాజ్ కౌషల్ ఈరోజు తెల్లవారుజామున హటాత్తుగా మరణించారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించకముందే మరణించినట్టు తెలుస్తుంది. మందిరా బేడీ ఆమె భర్త రాజ్ కౌషల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంపాటు ప్రేమలో ఉన్న వీరు 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉండగా మరో పాపను కూడా దత్తతు తీసుకున్నారు.