అల్లరి హీరో నరేష్ ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అయితే ఆ సంధర్బంగా ఆయన అభిమానుల కోసం ఓ సర్పైజ్ ను ఇచ్చారు. నరేష్ ప్రస్తుతం సభకు నమస్కారం అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను నేడు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నరేష్ ఇన్ షర్ట్ వేసుకుని ఓ సభలో మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్ కు తగినట్టుగా సినిమా టైటిల్ కూడా ఉంది. ఇక ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మల్లంపాటి సాతి దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్నానికి మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.