ఏపీ సర్కార్ పై పలువురు టీఆర్ఎస్ నాయకులు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయ లబ్ది కోసం తెలంగాణ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ మంత్రుల వలె అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. నీటి పంపకాల వివాదం అంశం పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, మా ప్రభుత్వం ఏమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదని అన్నారు.