తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వరుసగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ సర్కార్ మూడో సారి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డ్ నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా శ్రీశైలం ప్రాజక్ట్ నుండి నీటిని వాడుకుంటుందని ఆభ్యంతరం వ్యక్తం చేసింది. జూన్ 1 నుండి సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకుంటుందని లేఖలో పేర్కొంది. ఇప్పటి వరకూ మొత్తం 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని చెబుతూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖను రాశారు.