ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ వైకరిని కేబినెట్ తప్పుపట్టింది. ఇక మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ లో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నాని అన్నారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే తాను ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడటం లేదని అన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.