ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ బీజేపీ సీనియర్ నేత పురిఘుళ్ళ రఘురాం భేటీ అయ్యారు. ఒక కార్యకర్తగా ప్రధానమంత్రి మోడీ ని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇరవై ఐదు నిమిషాలు పాటు ప్రధానితో సమావేశం అయ్యానని రఘురా అన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ప్రధానితో తనకు ఇరవై ఆరు సంవత్సరాల అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి కూడా ప్రధాని అడిగారని రఘురాం అన్నారు.