యూపీలోని మహారాజ్ గంజ్ జిల్లాలోని కోఠిభర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కామాంధుడు తోటలో కూరగాయలు కోస్తున్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా వారు రూ.50 వేలు నిందితుడు ఇవ్వాలని చెప్పి పంచాయితీని ముగించారు.