తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా రాజుపేట్ గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన గంభీరావు పేట గ్రామంలో కూడా పర్యటించారు. అయితే పర్యటనలో కేటీఆర్ ను తమ గ్రామంలో గుడి కట్టించాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. దాంతో కేటీఆర్ మాట్లాడుతూ..గుడికి డబ్బులు ఇవ్వనని అన్నారు. గుడికి వద్దు..మీరే డబ్బులు వేసుకుని కట్టుకోండన్నారు. అర్జెంట్ గా గుడి కట్టే అవసరం లేదని చెప్పారు. ముందు రోడ్లు పూర్తి కానివ్వండి.. ఆ తరవాత భవనాలు కట్టుకుందామని చెప్పారు. ఊర్లో గుడి బాగానే ఉందని ఇప్పుడే తాను మొక్కి వచ్చానని చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ వచ్చిన తరవాత పెన్షన్లను పది రేట్లు పెంచినట్టు తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు.