ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కోవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు 4లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని సుప్రీంకోర్ట్ ముళ్లుగర్రతో పొడిచిందని వ్యాఖ్యానించారు. కోవిడ్ తో కేవలం 3651మంది మాత్రమే చనిపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని..మేము తీసిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు లక్ష యాభై వేల మంది కోవిడ్ తో మరణించారని అన్నారు.