ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టుపార్టీ డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న జోగా మృతి చెందాడు. దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగనార్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్-కంగదర్ గట్టీ ఏరియా కమిటీకి చెందిన కొంతమంది మావోయిస్టులు సమావేశమైనట్టు పోలీసులకు తెలిసింది. దాంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా అడవిలో మావోయిస్టులు కనిపించారు. దాంతో అర్థరాత్రి సమయంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.