సాధారణంగా సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు లేదా నటీనటులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం చూసాం. మరికొన్నిసార్లు ఎవరైనా వ్యక్తి తో బాధ విభేదాలు ఉన్నా వారి ఫోటోలను మార్పింగ్ చేసి వేధింపులకు గురి చేసిన ఘటన కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది చిల్లరగాళ్లు అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి వేధింపులకు గురి చేసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయితే తాజాగా ఒక వ్యక్తి దేవుడు తనకు ఎదో అన్యాయం చేసినట్టు అదేపనిగా అసత్యప్రచారం మొదలుపెట్టాడు.