విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా మళ్లీ ఈ రోజు షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మళ్లీ నవ్వు మొదలు అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్లలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు సునీల్ కూడా కనిపిస్తున్నారు. ఇక మరో పోస్టర్ లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు, వెంకటేష్ లు కనిస్తున్నారు.