ఏపీలో విద్యాసంస్థలను ఆగస్టు నుండి ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సురేష్ అన్నారు. ప్రత్యక్ష క్లాసులు లేనందున 70 శాతం మాత్రమే ఫీజులు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లో రెగ్యులేటింగ్, మానిటరింగ్ కమిటీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. అంతేకాకుండా సెట్ పరీక్షలు కూడా ఆగస్టులోనే జరుగుతాయన్నారు.