ఆంధ్రప్రదేశ్ లో వీఆర్వో లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీఆర్వోలకు నేరుగా సీనియర్ అసిస్టెంట్ లుగా పదోన్నతులు ఇవ్వబోతున్నారు. ఇక వీఆర్వో లకు అసిస్టెంట్ లుగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెడరేషన్ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. అయితే గతంలో వీఆర్వో లు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాలంటే కనీసం రెండు సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ లుగా పనిచేయాలనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.