టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ కి ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ సీఎం మనవడు భవ్య బిస్నోయ్ తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహరీన్ సంచలన ప్రకటన చేసింది. తాను భవ్య భిష్నోయ్ తో విడిపోయినట్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని పెళ్లి కూడా జరగబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తను భాగా అలోచించి తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాకుండా ఫ్యూచర్ లో భవ్య భిస్నోయ్ తో అతడి కుటుంబం మరియు ఫ్రెండ్స్ తో కానీ ఎటువంటి సంబంధం పెట్టుకోను అని తెలిపింది.