ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఏపీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తుండగా.. టిఆర్ఎస్ పార్టీ నాయకులు జగన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్, జగన్ లపై విమర్శలు కురిపించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు సీఎం కేసీఆరే కారణమన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలనే రెండవ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేసీఆర్ వాయిదా వేశారని అన్నారు.