దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరిగింది. తాజాగా దేశంలో 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 52,299 మంది కరోనా భారి నుండి కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో 800 కు పైగా మరణాలు నమోదవగా మళ్లీ ఈ రోజు 955 మంది కరోనా తో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్ ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ను సడలింపు చేశారు.